ముంబై : ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన క్రమంలో గతంలో ఫడ్నవీస్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఎన్సీపీతో కలిసి బీజేపీ అధికారం పంచుకునేది లేదని ఆ పార్టీతో బీజేపీ పొత్తు ' నెవర్..నెవర్..నెవర్' అంటూ ఐదేళ్ల కిందట ఫడ్నవీస్ చేసిన ట్వీట్‌ను పలువురు గుర్తు చేస్తున్నారు. ఎన్సీపీ అవినీతి పార్టీ అంటూ పలు సందర్భాల్లో ఆ పార్టీని విమర్శిస్తూ ఫడ్నవీస్ ట్వీట్లు చేశారు. ఎన్సీపీతో బీజేపీ పొత్తు ప్రసక్తే లేదని..ఇతర పార్టీలు మౌనంగా ఉంటే అసెంబ్లీలో వారి అవినీతిని తాము ఎండగట్టామని 2014 సెప్టెంబర్‌లో ట్వీట్ చేసిన ఫడ్నవీస్ ఇప్పుడు అదే ఎన్సీపీ చీలిక వర్గంతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకోవడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు చివరికి సాధించారు అంటూ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌లను ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ అభినందించారు.
ఫడ్నవీస్ అప్పుడలా..ఇప్పుడిలా..!